కడప: తిరిగి హిందుత్వాన్ని స్వీకరించిన 225 మంది మతం మారిన హిందువులు - సత్యం జి మార్గదర్శనం

కడప , 27/04/2014 : విశ్వ హిందూ పరిషద్ ధర్మ ప్రసార సమితి అధ్వర్యంలో తేది 24/04/2014 నాడు కడప జిల్లా, మైదుకూరు మండలం, ఉత్సలవరం గ్రామం లో జరిగిన పునరాగమణ కార్యక్రమంలో భాగంగా 64 కుటుంబాలకు చెందిన 225 మంది గతంలో క్రైస్తవంలోకి మతం మారిన హిందువులు తిరిగి తమ మాతృదర్మం హిందుత్వంలోకి తిరిగి వచ్చారు.

ఈ కార్యక్రమానికి మార్గదర్శనం చేస్తూ శ్రీ గుమ్ముల సత్యం (విశ్వ హిందూ పరిషద్ జాతీయ సహా కార్యదర్శి) హిందుత్వం యొక్క సమగ్ర స్వరూపాన్ని వారి ముందు ఉంచడం జరిగింది, ఏ రూపంలో దేవుణ్ణి కొలిచిన ఇబ్బంది లేని స్వేచ్చాయుత ఆరాధనా విధానం హిందుత్వంలో తప్ప ప్రపంచంలోని మరే మతంలో లేదని, నదులు ఎన్ని మార్గాలలో ప్రవహించినా చేరుకునేది ఆ సముద్రంలోకే అనే జగద్వితిత సత్యాన్ని మనం మరువకూడదని అన్నారు, కేవలం నా మతమే గొప్ప, నా దేవుడే గొప్ప అనే సంకుతత్వం హిందుత్వంలేదని ముప్పై ముడు కోట్ల దేవతలను ఆరాధించే హిందువులకు, మంచి పని చేసే ప్రతి మనిషిలో దేవుణ్ణి చూసే హిందుత్వాన్ని నాశనం చేయాలనుకోవడం కేవలం కలగా మిగిలిపోయే వాస్తవం అని అయన అన్నారు.కార్యక్రమం లో పాల్గొన్న వారికి భగవద్గీత పుస్తకాలు అందించడం జరిగింది.SOURCE:- VHPAP.ORG
CLOSE ADS
CLOSE ADS

#buttons=(Accept !) #days=(1)

Our website uses cookies Learn..
Accept !